రాజన్న ప్రసాదంగా కోడెల పంపిణీ భక్తులు పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల ,అర్జున్ సమాచారం: రైతులకు రాజన్న ప్రసాదంగా కోడెలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలను సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు కోడెలను అందజేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్...