రాజాపూర్‌లో ఫారెస్ట్ అధికారిణిని అడ్డుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
అర్జున్ సమాచారం: సెప్టెంబర్ 2 | పెద్దపల్లి: రామగిరి మండలం రాజాపూర్ (ఆదివారంపేట): రామగిరి ఓపెన్‌కాస్ట్–II ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు సంబంధించి ఇళ్లు, ఇతర నిర్మాణాలు, చెట్ల విలువను అంచనా వేసేందుకు వచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి ఎస్.కె. నహీద్‌ను రాజాపూర్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ అడ్డుకున్నట్లు సమాచారం. అధికారిక లేఖ ప్రకారం ఆదివారంపేట గ్రామ పరిధిలోని 14.08 ఎకరాల భూమికి సంబంధించి ఇళ్లు, నిర్మాణాలు, చెట్ల విలువను అంచనా వేసి, పరిహారం చెల్లింపునకు అవసరమైన ఎస్టిమేషన్‌ను సిద్ధం చేయాలని ఫారెస్ట్ అధికారులను...