రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్*
అధికారులతో కలిసి భూముల వివాదానికి సంబంధించిన వివరాల సేకరణ కమాన్ పూర్,అర్జున్ సమాచారం: రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు...