రాజ్యసభలో పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 30,అర్జున్ సమాచారం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026ను కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఏమాత్రం సహించబోమని, పేపర్ లీకేజీల పట్ల తమ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా...