రాజ్యాంగ సూత్రాలు పార్లమెంటుకే పరిమితం కాకూడదు – ప్రభుత్వ పథకాలు రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడి – గత ప్రభుత్వాలు ఆర్టికల్ 356ను వందసార్లు దుర్వినియోగం చేశాయని విమర్శ – భారత్ ఫస్ట్, కర్తవ్యం అనే సూత్రాలతో ముందుకు సాగాలని పిలుపు – రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రత్యేక వ్యాసం
అర్జున్ సమాచారం: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దినపత్రికల్లో "రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఒక నిబద్ధత" పేరిట ప్రత్యేక వ్యాసం రాశారు. రాజ్యాంగ సూత్రాలు కేవలం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడి దైనందిన జీవితంలో అంతర్భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లకు ఘన నివాళులర్పించిన ప్రధాని.. సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి దేశ ప్రధాని స్థాయికి చేరుకోగలగడం మన రాజ్యాంగ వైశిష్ట్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక...