రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక: సీపీ అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని: అర్జున్ సమాచారం: తెలంగాణ వీరవనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్, అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పెత్తందార్ల దురాగతాలకు, నాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరాడిన తీరు...