రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఘనంగా పోలీస్ మీ కోసం కార్యక్రమం: పోలీసు కమీషనర్ గౌష్ ఆలం

కరీంనగర్,అర్జున్ సమాచారం: సైబర్ నేరాలు, డ్రగ్స్ రోడ్డు ప్రమాదాలపై అవగాహనా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి శాంతిభద్రతల పరిరక్షణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం. కమిషనరేట్ పరిధిలో మరో 700 కెమెరాల ఏర్పాటు లక్ష్యం- సీపీ గౌష్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వెలిచాల గ్రామం, రామడుగు మండలంలో బుధవారం "పోలీస్ మీ కోసం" అవగాహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ  కెమెరాలను పోలీసు ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు....