రామాయణం’ మూవీ మ్యూజికల్ జర్నీ ప్రారంభం
‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. పదే పదే వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ...