రామ్లీలా మైదానానికి తరలిరండి.. విద్యార్థులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమం అని వెల్లడి ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని స్పష్టం భయపడకుండా విద్యార్థులు తరలిరావాలని ప్రత్యేక విజ్ఞప్తి పోలీసులకు, లాఠీలకు భయపడొద్దని యువతకు ధైర్యం చెప్పిన రాహుల్
న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రామ్లీలా మార్చ్’కు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ఆత్మను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమమని, ఓట్ల దొంగతనాన్ని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని రాహుల్ గాంధీ...