రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థ పై నివేదిక కీలక సూచనలు చేసిన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ హైదరాబాద్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని కలిసి నివేదిక అందించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. తెలంగాణ వ్యవసాయ - రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్ , రాంరెడ్డి గోపాల్ రెడ్డి , గంగాధర్ , ఎం. భవానీరెడ్డి ముఖ్యమంత్రి...