రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జెఎస్ డబ్ల్యు సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తాం క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపడుతున్నాం క్రీడాకారులను ప్రోత్సహించేందుకే 3శాతం రిజర్వేషన్ ఎలైట్ ప్లేయర్స్ తో మంత్రి లోకేష్ విందు సమావేశం
అమరావతి,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జెఎస్ డబ్ల్యు సంస్థ ముందుకు వచ్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కామన్ వెల్త్, ఆసియా గేమ్స్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాత్రి డిన్నర్ మీట్ నిర్వహించారు. ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై క్రీడాకారుల నుంచి...