ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 7:53 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం

గోదావరిఖని,అర్జున్ సమాచారం:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్  ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలని,విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలను అందించాలని, మధ్యాహ్నం భోజన పథకానికి నిధులు పెంచి అక్షయపాత్ర, ఇస్కాన్, మన్న సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్  మరియు ఎంఈఓ ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని ,పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి జిఓ నెంబర్ 7, 8 ,9 లను రద్దు చేయాలని, ఇంటర్ కళాశాలలకు మధ్యాహ్నం భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించి నిధులు కేటాయించాలని ,అద్దె భవనాలలో నడుస్తున్న పాఠశాలలు హాస్టల్స్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి ఆధునాతన భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి బడి బస్సులు నడపాలని ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రతి పాఠశాలకు కరెంటు ,ఇంటర్నెట్ త్రాగునీరు ,వంట షెడ్లు, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలని, విద్యాసంస్థలలో ర్యాగింగ్ నిరోధక, డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, విద్యాహక్కు చట్టం అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ,కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి ఐదు లక్షల విద్య భరోసా కార్డులు, ఉచిత లాప్టాప్ లు అందించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరల పార్టీ పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు సహకరించిన ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తడిగొప్పుల అనుప్ సాయి ,అభిషేక్ , మండల పేరు ఏం పేరు గణేష్, అమరేందర్, రాహుల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.