రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం

గోదావరిఖని,అర్జున్ సమాచారం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్  ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలని,విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలను అందించాలని, మధ్యాహ్నం భోజన పథకానికి నిధులు పెంచి అక్షయపాత్ర, ఇస్కాన్, మన్న సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలని,...