రిజిస్ట్రేషన్లపై సర్కార్ ఉక్కుపాదం

హైదరాబాద్, సెప్టెంబర్ 25,అర్జున్ సమాచారం: మరోసారి ల్యాండ్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులకు భూబదలాయింపులపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు భూముల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో...