ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 7:58 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రిమ్స్ ఆసుపత్రి ఘటన సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణంపై కేసును తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఎస్ఎన్సీయూ వార్డులో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ అలారం, ఫైర్ పరికరాలు, ఎమర్జెన్సీ తరలింపు, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.
======================