రియాద్‌పై హౌతీల డ్రోన్ దాడికి సౌదీ ప్రతీకారం – యెమెన్ రాజధాని సనాపై విరుచుకుపడ్డ సంకీర్ణ దళాలు – సౌదీ సార్వభౌమత్వానికి భంగమంటూ అరబ్ దేశాల ఖండన – హౌతీ గ్రూప్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన బ్రిటన్ – 24 గంటల్లో 72 దాడులు జరిగాయని హౌతీల ఆరోపణ

 అర్జున్ సమాచారం: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడికి పాల్పడిన కొన్ని గంటల్లోనే యెమెన్‌లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మంగళవారం రాత్రి యెమెన్ రాజధాని సనాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ పోటాపోటీ దాడులతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. సనా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సౌదీ బలగాలు దాడులు చేసినట్లు హౌతీలకు చెందిన అల్-మసిరా టీవీ వెల్లడించింది. ఈ దాడుల కారణంగా భారీ...