రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ

కరీంనగర్,అర్జున్ సమాచారం: విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, తగిన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం కరీంనగర్ లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాల, స్టోర్ రూమ్, పడక గదులు, మరుగుదొడ్లు, భోజన ఏర్పాట్లు, విద్యార్థులకు అందిస్తున్న మెనూ, ఆహార పదార్థాల నాణ్యత, వైద్య సేవలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను...