ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 7:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రుషికొండ బీచ్‌లో ముగ్గురు బాలురు గల్లంతు

విశాఖ,అర్జున్ సమాచారం:
రుషికొండ బీచ్‌లో సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు గల్లంతయ్యారు.

గల్లంతైన బాలురు సూర్య ప్రకాష్, నితీష్, ప్రశాంత్‌గా సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపు చర్యల్లో గల్లంతైన ప్రశాంత్ మృతదేహం లభ్యమైంది.

మిగిలిన ఇద్దరు బాలురు సూర్య ప్రకాష్, నితీష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ముగ్గురు బాలురు గల్లంతయ్యారన్న విషయం తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
==========================