రూటు మార్చిన జగన్. గెలుపు గుర్రాల కే టిక్కెట్టు స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక పై వైసీపీ కొత్త వ్యూహం మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు మూడు పేర్లు. సర్వేలు,క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా తుది ఎంపిక. జిల్లా అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం
తాడేపల్లి,అర్జున్ సమాచారం: స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల ఎంపిక విషయంలో రూటు మార్చినట్లు,పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.గతంలో నాయకత్వానికి నచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చే విధానానికి భిన్నంగా ఈసారి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులకు ముందుగానే ఒక పేరును ఖరారు చేయకుండా.ప్రతి స్థానానికి మూడు పేర్లతో జాబితా సిద్ధం చేయాలని పార్టీ జిల్లాఅధ్యక్షులు,స్థానిక నాయకత్వానికి,సూచించి నట్లు తెలుస్తోంది.ఈ ముగ్గురిలో ఎవరి పట్ల...