రెండు చార్జిషీట్ల కోసం రూ.2 లక్షల లంచం..! ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన కీసర ఎస్‌ఐ.. పోలీస్ శాఖలో కలకలం..

మేడ్చల్,అర్జున్ సమాచారం: రెండు కేసుల్లో చార్జిషీట్లు త్వరగా దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన కీసర ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూ మోసం, 498ఏ కేసుల్లో చార్జిషీట్లు ఆలస్యం కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఎస్‌ఐ ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోమవారం కీసరలోని శిల్పా లేఅవుట్ వద్ద లంచం తీసుకుంటుండగా శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు...