రేణిగుంట గంగమ్మ జాతర ముగింపు సందర్భంగా చివరి రోజున భారీ అన్నదాన కార్యక్రమం – 700 మందికి పైగా అన్న ప్రసాదం వితరణ.. ఎనిమిదో ఏటా పూల వ్యాపారుల అన్నదాన సేవ.. అమ్మవారి కృపతోనే సేవ చేస్తున్నామన్న యజమానులు…
అర్జున్ సమాచారం: రేణిగుంట పట్టణంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జాతర ముగింపు సందర్భంగా చివరి రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. రేణిగుంట బస్టాండ్ ఆవరణలో పట్టణ పూల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా చివరి రోజున సుమారు700 మందికి పైగా భక్తులకు, నిరుపేదలకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. అమ్మవారి జాతర సందర్భంలో పేదలకు ఆకలి తీర్చడం గొప్ప పుణ్యఫలమని...