రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి ఏపీల జలపండుగ..తెలంగాణలో క్రాప్ హాలిడే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: సింగరేణి నిండా కుంభకోణాలు ఉన్నాయని నేను చెప్పినా. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి, నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు. నువ్వు ఉత్తరం రాస్తే నేను విచారణకు ఆదేశిస్తా అన్నాడు. మీడియా ముందు మాట్లాడుడు కాదు, దమ్ముంటే సింగరేణి కుంభకోణం పైన ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపైన విచారణ  జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం అయన తెలంగాణ భవన్ లో నిర్వహించిన నర్సంపేట నియోజక వర్గ సమావేశంలో మాట్లాడారు....