రేసులో రాములమ్మ మంత్రి పదవిపై విజయశాంతి పేరు తెరపైకి
హైదరాబాద్,అర్జున్ సమాచారం: హైదరాబాద్ కొండా సురేఖపై చర్యల చర్చ ఖాళీ అయ్యే స్థానంపై అధిష్టానం కసరత్తు బీసీ మహిళా కోటాలో విజయశాంతికి అవకాశం. మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనకు చేరిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవిపై కొత్త చర్చ మొదలైంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే, ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహిళా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత వంటి అంశాలను పరిగణనలోకి...