రైతన్నకు అండగా రైతు భరోసా… జిల్లాలో రూ.318.42 కోట్ల నిధుల జమ 1.78 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా రైతు భరోసా నిధులను ఇతర బకాయిలకు సర్దుబాటు చేయొద్దు: బ్యాంకులకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులకు సాగు పెట్టుబడికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును సకాలంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద జిల్లాలో అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విడతల వారీగా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో...