ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 8:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30,అర్జున్ సమాచారం:
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రబీ పంటలకు సంబంధించి 2027-28 సీజన్‌కు మద్దతు ధరను  నిర్ణయించింది. గోధుమలు, బార్లీ (జౌ), శనగలు, ఆవాలు, పొద్దుతిరుగుడు (కుసుమ), మసూర్ (కందులు/చిరుధాన్యాల రకం) పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గోధుమలపై క్వింటాలుకు రూ.25 పెంచారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరలో  అత్యధికంగా కుసుమ పంటకు క్వింటాలుకు ₹675 చొప్పున పెంపుదల చేశారు. ఆ తర్వాత రేప్‌సీడ్, ఆవాలకు క్వింటాలుకు ₹413 చొప్పున పెంచారు. మసూర్ పంటకు క్వింటాలుకు ₹390, బార్లీకి (జౌ) క్వింటాలుకు ₹136, శనగలకు క్వింటాలుకు ₹83, గోధుమలకు క్వింటాలుకు 25 చొప్పున పెంచారు.
నిర్ణయించిన కనీస మద్దతు ధరల (MSP) వివరాలు
గోధుమలు: క్వింటాలుకు ₹2,610
శనగలు: క్వింటాలుకు ₹5,928
బార్లీ (జౌ): క్వింటాలుకు ₹2,286
మసూర్: క్వింటాలుకు ₹7,390
ఆవాలు: క్వింటాలుకు ₹6,613
పొద్దుతిరుగుడు (Safflower) క్వింటాలుకు: ₹7,215
ఢిల్లీ ట్రాఫిక్ నిర్వహణను మెరుగు చేయడం కోసం ‘ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’  తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 1,529 ట్రాఫిక్ సిగ్నల్స్ స్థిరమైన మ్యాన్యువల్ పద్ధతిలో ఉన్నాయి. అయితే ITMS వచ్చిన తర్వాత ఈ సిగ్నల్స్ ట్రాఫిక్ రద్దీకి తగ్గట్లుగా సిగ్నల్ సమయాన్ని అవే అడ్జస్ట్ చేసుకుంటాయి. దీనిని మూడు విడతలలో (ఫేజ్‌లలో) అమలు చేయనున్నామని తెలిపారు. వేర్వేరు కారిడార్లలో వేర్వేరు సమయాల్లో ఈ పద్ధతిని అమలు చేస్తారు. ఇందుకోసం కేంద్రం 1,790 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌తో కలిపి రైన్యూవబుల్ ఎనర్జీ సరఫరా చేయడం కోసం 1.86 లక్షల కోట్ల అంచనాతో కూడిన ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ III’ పథకానికి కూడా మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది.దేశంలో శాస్త్రీయ పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ధార’ పథకాన్ని తీసుకొచ్చింది. రూ. 1,86,405 కోట్లను ఈ పథకానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
====================================