రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి: నారాయణరావుపేట సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
సిద్దిపేట,అర్జున్ సమాచారం: వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణరావుపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల పంటలకు నీరందించడంలో ఇబ్బందులు ఏర్పడి, పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు రైతులకు 24 గంటల నాణ్యమైన...