రైతులు వ్యవసాయ పంటల సాగు సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి… జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం..

జమ్మికుంట,అర్జున్ సమాచారం: ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో వ్యవసాయ సాగు సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం, రైతులకు సూచించారు. ప్రభుత్వం అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని తప్పనిసరిగా కొనుగోలు చేసిన రసీదు బిల్లును భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు...