ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 5:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రైతుల ఉసురు తీస్తున్న రేవంత్ రెడ్డి.. ఫర్టిలైజర్ ధరలను పెంచడంతో రైతులకు తీవ్ర నష్టం? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట,అర్జున్ సమాచారం:
రేవంత్ రెడ్డి రైతుల ఉసురు తీసుకుంటున్నాడని మాజీమంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలం చంద్రాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాన్ని గురువారం మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మొక్కజొన్న రైతు కనీసం నాలుగు బస్తాలు ఇవ్వాలి కానీ ప్రభుత్వం సరిపడ ఎరువులు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రతి రైతుకు రెండు బస్తాలే ఇస్తామని అది కూడా మూడు విడుదల ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఎరువుల ధరలు విపరీతంగా పెంచడంతో రైతులకు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో నిలువలు ఉంచుకోక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతుల బాధలు ప్రభుత్వం అర్థం చేసుకోక పోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే యాప్ రద్దు రైతులకు నేరుగా యూరియాను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు అందించే యూరియా పై సీలింగ్ ఎత్తివేయాలని అన్నారు. రైతులకు ఎంత యూరియా అవసరమైతే అంత సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కామిని శ్రీనివాస్, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు, మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి, చంద్రమౌళి, బిఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, రాచకొండ లింగం, రాచకొండ బిక్షపతి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
=============================