రైతుల ఉసురు తీస్తున్న రేవంత్ రెడ్డి.. ఫర్టిలైజర్ ధరలను పెంచడంతో రైతులకు తీవ్ర నష్టం? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట,అర్జున్ సమాచారం: రేవంత్ రెడ్డి రైతుల ఉసురు తీసుకుంటున్నాడని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలం చంద్రాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాన్ని గురువారం మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మొక్కజొన్న రైతు కనీసం నాలుగు బస్తాలు ఇవ్వాలి కానీ ప్రభుత్వం సరిపడ ఎరువులు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రతి రైతుకు రెండు బస్తాలే ఇస్తామని అది కూడా మూడు విడుదల ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల...