రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి టీఎంసీల నీటిని సముద్రం పాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిది! క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్,అర్జున్ సమాచారం: మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యంలో తరుగు పేరుతో అధికంగా కోతలు విధించకుండా, నిబంధనల ప్రకారం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంతో పాటు ఐదు మండలాలు, రెండు పట్టణాల్లో రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు లేక పదెకరాలు ఉన్న రైతులు...