రోడ్లపై కాదు.. ఆధారాలతో ఈసీ వద్దకు వెళ్లండి ఈటల రాజేందర్ ఢిల్లీలో ఇండియా కూటమి నిరసనలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందన ఆందోళనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వ్యాఖ్య
అర్జున్ సమాచారం: ఆధారాలుంటే ఎన్నికల సంఘాన్ని కలవాలని ప్రతిపక్షాలకు సూచన ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ఆందోళనల వల్ల రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతిపక్ష నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల... ప్రతిపక్షాల తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసేవారు, అందుకు సంబంధించిన ఆధారాలతో ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని...