రోప్ స్కిప్పింగ్‌లో పారమిత విద్యార్థుల సత్తా కరీంనగర్ ఆగస్టు 28

కరీంనగర్ ఆగస్టు 28,అర్జున్ సమాచారం: హైదరాబాద్ అల్మాస్‌గూడలో ఈ నెల 23న తెలంగాణ రోప్ స్కిప్పింగ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్‌షిప్‌లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-10 విభాగంలో 3వ తరగతి విద్యార్థి సి.హెచ్. ఈశ్వర సాయి, అండర్-8 విభాగంలో 2వ తరగతి విద్యార్థి డి. నిఖిల్ బంగారు పతకాలు సాధించగా, అదే విభాగంలో ఎం. శ్రేయాన్స్ కాంస్య పతకం సాధించాడు. విజేతలను పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయులు...