లక్కీ డ్రా ద్వారా బార్ లైసెన్సు కేటాయింపు కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ

నిజామాబాద్,అర్జున్ సమాచారం: బోధన్ పట్టణానికి నూతనంగా మంజూరైన మద్యం బార్ కు లాటరీ ద్వారా లైసెన్సు జారీ కోసం శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ ప్రక్రియ కొనసాగింది. బార్ లైసెన్సు కోసం మొత్తం 19 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీసి బార్ కేటాయింపు కోసం లైసెన్స్ ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ,...