ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లాభాల్లో 36 శాతం కార్మికులకు కేటాయించాలి: తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం

తాండూర్;అర్జున్ సమాచారం:
గత ఆర్థిక సంవత్సరం 2025–26లో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, ప్రకటించిన లాభాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా 36 శాతం వాటాను కార్మికులకు కేటాయించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేసింది.తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, బెల్లంపల్లి వైస్‌ ప్రెసిడెంట్ సూచనతో సోమవారం ఏరియా వర్క్‌షాప్ ఇన్‌ఛార్జ్ నరేష్‌కు సంఘం నాయకులు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులకు అనుగుణంగా లాభాల వాటాను పారదర్శకంగా ప్రకటించి, 36 శాతం లాభాల వాటాను కార్మికులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్‌షాప్ పిట్ సెక్రటరీ గాజవేని శ్రీనివాస్, ఏరియా జాయింట్ సెక్రటరీ జి. వెంకట్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎస్. సురేష్, నాయకులు గణపతి, వైకుంఠం, ఎస్. వెంకటేశ్వర్లు, కనకయ్య, వెంకటస్వామి, అంజయ్య, చంద్రయ్యతో పాటు మహిళా కార్మికులు, వర్క్‌షాప్ కార్మికులు పాల్గొన్నారు.
=======================