లైంగిక వేధింపులతో సింగరేణి ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య తనను ఓ అధికారి రేప్ చేశాడని సూసైడ్ నోట్లో పేర్కొన్న విద్యార్థిని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పెద్దపల్లి,అర్జున్ సమాచారం: గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసి, ఈసెట్ ద్వారా ఉస్మానియాలో ఇంజనీరింగ్ సీటు సాధించి, ఇంటర్న్షిప్ కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో ఓ విద్యార్థిని (21) చేరింది. ఈ క్రమంలో తాను కూడా డిప్లొమా అదే కాలేజీలో చేశానని చెప్పి విద్యార్థినికి బొమ్మకంటి రవికుమార్ అనే ఓవర్మ్యాన్ (సూపర్వైజర్) పరిచయమైయారు. ఈ క్రమంలో యువతిపై రవికుమార్ లైంగిక దాడికి పాల్పడగా, యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇంటర్న్షిప్ మానేసి గోదావరిఖనిలోని ఓ కంప్యూటర్ సెంటర్లో విద్యార్థిని పని చేస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీ...