లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు ఏపీ ప్రభుత్వం రూ.75 లక్షల ఆర్థిక సాయం అందజేత – రాష్ట్ర కమిటీ సభ్యుడు జోరిగ నాగరాజుకు రూ. 20 లక్షల సహాయం – త్వరలోనే మరో 32 మంది మావోయిస్టులకు రూ. 1.21 కోట్ల సాయం పంపిణీ – గత రెండున్నరేళ్లలో 18 మంది మావోయిస్టులు మృతి.. 73 మంది అరెస్ట్
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాజధాని అమరావతిలోని ఏపీ డీజీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో, లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు పునరావాస సహాయం కింద మొత్తం రూ. 75 లక్షల డిమాండ్ డ్రాఫ్టులను (డీడీలు) ఆయన స్వయంగా అందజేశారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు జోరిగ నాగరాజు అలియాస్ కమలేశ్, ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, పది మంది ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు...