వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్‌!

శేరిలింగంపల్లి, అక్టోబర్ 31:అర్జున్ సమాచారం: హైదరాబాద్‌ శివారులోని వట్టినాగులపల్లిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 27 మందిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి సుమారు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ది స్కై బై విహారా ఫామ్‌లో అందర్‌ బహార్‌ పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ దాడి చేపట్టారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో 27 మంది పట్టుబడ్డారు. ప్రాథమిక విచారణలో చిన్న యాదవ్‌ (బీఎన్‌ రెడ్డి...