వనపర్తి జిల్లాలో 900 ఏళ్ల నాటి శాసనం.. – వనపర్తి జిల్లా కోటకొండలో 12వ శతాబ్దపు శాసనం గుర్తింపు – కల్యాణి చాళుక్య చక్రవర్తి ఆరవ విక్రమాదిత్యుడి కాలం నాటిదిగా నిర్ధారణ – భూదానాల వివరాలను వెల్లడించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం – తెలుగన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని చదివి విశ్లేషించిన హరగోపాల్

అర్జున్ సమాచారం: తెలంగాణ చారిత్రక సంపదలో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా, కోటకొండలోని ఒక శివాలయంలో సుమారు 900 ఏళ్ల నాటి పురాతన శాసనాన్ని చరిత్రకారులు గుర్తించారు. ఇది కల్యాణి చాళుక్య చక్రవర్తి ఆరవ విక్రమాదిత్యుడి (త్రిభువనమల్ల దేవుడు) కాలం నాటిదని నిర్ధారించారు. ఇప్పటివరకు ఎవరికీ అంతుచిక్కని ఈ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డా. బైరోజు శ్యామ్ సుందర్, హనుమానగరి వేమారెడ్డి, పండ్రప్రగ్గడ...