వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్న వరంగల్ పోలీసులు 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం వరంగల్
వరంగల్,అర్జున్ సమాచారం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్లను నియమించామని కమిషనర్ ఎన్ శ్వేత వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రత్యేక దృష్టి సారించి నేర విచారణ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా జరిగిన నేరాలను విశ్లేషణ చేయగా, ఈ రోజు ఉదయం ఇద్దరు అనుమానితులను...