వర్షంలోనూ వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నితికా పంత్, ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం
కుమురం భీమ్ ఆసిఫాబాద్,అర్జున్ సమాచారం: వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా కాగజ్‌నగర్ పెద్దవాగు, ఆసిఫాబాద్ పెద్దవాగు వద్ద చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నితికా పంత్, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. వర్షం కురుస్తున్న సమయంలోనూ నిమజ్జన ప్రాంతాలను సందర్శించిన జిల్లా ఎస్పీ, నిమజ్జన ప్రక్రియ, పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే...