వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలి కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.

అర్జున్ సమాచారం: దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి  శివరాజ్ సింగ్ చౌహాన్  హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి  వారిని కలిసి వర్షాభావం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు.మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజురు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుత వర్షాభావ  పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ వివరాలతో వినతిపత్రాన్ని అందజేశారు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అలాగే,...