ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 7:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వసతి గృహాల్లో సకల సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్
బాజ్ పాయి అన్నారు.
సోమవారం హనుమకొండ గోకుల్ నగర్ లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి  గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా వసతి గృహంలో

ఉంటున్న విద్యార్థుల సంఖ్య గురించి ఆరా తీశారు, వారు ఎక్కడెక్కడి నుండి వచ్చారు,అలాగే వసతి గృహం లో ఉన్న సిబ్బంది వివరాలను  కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు

అనంతరం సీసీ కెమెరాల

పనితీరును, వంటకు ఉపయోగించే పప్పు  దినుసులు, బియ్యం, గుడ్ల నాణ్యత ను పరిశీలించి వాటి సరఫరా గురించిన వివరాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వంటశాలకి వెళ్లి

భోజన తయారీ తీరు
గురించి తెలుసుకొని…. విద్యార్థులతో మాట్లాడుతూ… ఈరోజు ఎం టిఫిన్ పెట్టారు…రుచికరంగా ఉందా అని కలెక్టర్ ఆరా అడిగారు

కిచెన్ షెడ్ మరమ్మత్తు పనుల పురోగతి ని తెలుసుకొని

పలు  సూచనలను కలెక్టర్ తెలుపుతూ….వాటర్ పోవడానికి
డ్రైనేజి వ్యవస్థ బాగుండాలని… నీరు ఎక్కడ ఆగకుండా ఉండేలా చూడాలన్నారు.
వర్షపు నీటి సంరక్షణకు కావాల్సిన చర్యలను చేపట్టాలన్నారు.

తాగునీరు, పారిశుద్ధ్యం,  మౌలిక వసతులను పరిశీలించి…. వసతి గృహంలో పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని,వసతి గృహ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని వార్డెన్ కి

తెలియజేశారు.

అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా… సమయాన్ని వృధా చేయకుండా…ఒక లక్ష్యం పెట్టుకొని అందుకు తగ్గట్టు గా కష్టపడాలని

తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు
==============================