వసతి గృహాల్లో సకల సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ గోకుల్ నగర్ లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య గురించి ఆరా తీశారు, వారు ఎక్కడెక్కడి నుండి వచ్చారు,అలాగే వసతి గృహం లో ఉన్న సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి...