ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 5:13 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వాయిదాలతో పోటీ పరీక్షల పార్లమెంట్ తెర మీదకు అక్రమ మార్గాల సవరణ బిల్లు

న్యూఢిల్లీ, జూలై 27,అర్జున్ సమాచారం:
పేపర్ లీక్‌లపై కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పోటీ పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు, 2026ను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును అయితే, బిల్లును ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ప్రతిపక్ష ఎంపీల నినాదాలు, గందరగోళం మధ్య లోక్ సభ మళ్లీ  వాయిదా వేశారు. దాంతో పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చ ఇంకా జరగలేదు.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ బిల్లును విపక్షాల నినాదాల నడుమ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందే. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ కు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ఆదేశించింది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో పార్లమెంట్‌లో నేడు సైతం మరోసారి గందరగోళం నెలకొనడంతో అంతకుముందు లోక్‌సభ, రాజ్యసభలు రెండూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. విద్యార్థులపై బలప్రయోగం చేశారు, విచక్షణ లేకుండా పోలీసులు ప్రవర్తించారన్న ఆరోపణలపై జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో, ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడిందిధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభలో విపక్షాల ఆందోళనల మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టగా దీనిపై సభ్యుల సూచనలు స్వీకరించి చర్చ నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయితే, ఈ బిల్లు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని చర్చను ఇతర అంశాలతో మళ్లించవద్దని ఆయన సూచించారు.కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఈ సవరణ బిల్లును తీవ్రంగా విమర్శించాయి. ఈ బిల్లు అనేది శాశ్వత పరిష్కారం కాదని ఆరోపించాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో జరిగిన లాఠీచార్జిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పేపర్ లీక్ ఘటనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం కూడా చర్చకు వచ్చింది.ఈ కొత్త పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026 ప్రకారం.. ఇక పేపర్ లీక్ కేసులపై దర్యాప్తు రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. పరీక్షలలో పేపర్ లీక్‌లు లేదా అక్రమ పద్ధతులకు పాల్పడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. సంఘటిత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా పడుతుంది.ప్రస్తుతం చట్టాల ప్రకారం.. వ్యక్తిగతంగా పేపర్ లీక్‌కు పాల్పడితే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు.బిల్లులోని కొత్త సవరణలకు ఆమోదం లభిస్తే.. తీవ్రమైన కేసుల్లో గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
ధర్మేంద్రకు ఘన స్వాగతం
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్, ఇవాళ‌ తొలిసారి పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్డీయే మిత్రపక్షాల నుంచి అనూహ్య రీతిలో ఘన స్వాగతం లభించింది. మరోవైపు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం జరిగిందంటూ విపక్షాలు పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనకు దిగాయి. దీంతో పార్లమెంట్‌లో భిన్నమైన వాతావరణం కనిపించింది. ఉదయం ప్రధాన్ పార్లమెంట్ ప్రాంగణంలోకి రాగానే.. మకార్ ద్వార్ వద్ద గుమిగూడిన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఆయనను గౌరవసూచకంగా లోపలికి తీసుకెళ్లి, సంప్రదాయ టోపీని బహూకరించారు. ఈ క్లిష్ట సమయంలో తమ నేతకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నామని అధికార కూటమి ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది.ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో విపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. నీట్ ఆందోళనల సందర్భంగా జులై 20న విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ చలో’ యాత్రపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, ‘శిక్షా చోరీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థులపై పెట్టిన క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. విద్యార్థులపై పోలీసుల చర్యల విషయంలో హోంమంత్రి స్పందించే వరకు సభా కార్యకలాపాల్లో పాల్గొనకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థలోని లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు లబ్ధి పొందకుండా నిరోధించడానికే తాను తప్పుకుంటున్నట్లు ప్రధాన్ తన రాజీనామా సందర్భంగా పేర్కొన్నారు.
==============================