ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 7:11 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వాయు లింగేశ్వరుని సేవలో సినీ నటి డింపుల్ హయతి

 శ్రీకాళహస్తి సెప్టెంబర్ 24,అర్జున్ సమాచారం:

శ్రీకాళహస్తీశ్వరాలయం కు సినీ నటి డింపుల్ హయతి కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు.గురువారం రాహుకాల సమయం  రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ  ఫ్రొటో కాల్ ఎ. ఈ. ఓ లోకేష్ రెడ్డి స్వాగతం పలికారు. తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ  దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్ర పటం తీర్ద ప్రసాదాలు, ఎ ఈ ఓ లోకేష్ రెడ్డి నటి డింపుల్ హయతి కు అందజేశారు.ఆలయం బయట సినీ నటి డింపుల్ హయతి ను చుసిన అభిమానులు చరవాణి లో సెల్ఫీ,ఫొటోలు దిగారు. ఆమె అందరి తో ఆప్యాయంగా పలకరించారు.
==============================