వింటర్‌ సెషన్‌లో డీలిమిటేషన్‌.. డిసెంబర్‌ మొదటివారంలో పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ, : అర్జున్ సమాచారం: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ తొలివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా కోటా బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను నియోజకవర్గాల పునర్విభజన ద్వారా గరిష్ఠంగా 850కు పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తున్నది. ఈ బిల్లు...