ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 7:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలి సీఎం చంద్రబాబు నాయుడు

మహాబలిపురం,అర్జున్ సమాచారం:
హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం చెన్నైలో జరిగింది. ఈ భేటికి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హజరయ్యారు.  సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు  ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని వెల్లడించారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సీఎం సూచించారు.  ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్కు ప్రతిపాదన తెచ్చారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని ప్రతిపాదించారు.  అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం  చేసారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలి. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు, తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్న సీఎం, 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ప్రసంగంలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదనీ వెల్లడించారు.
విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలనీ కేంద్రాన్ని కోరారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు  కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నట్టు స్పష్టం  చేసారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలనీ కోరారు.
==================================