కరీంనగర్,అర్జున్ సమాచారం:
మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవన్ లాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వితంతు పింఛన్ మంజూరు చేయడానికి ఓ వ్యక్తిని రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ చేసి కార్యదర్శిని పట్టుకున్నారు.