విదేశీ మారక నిల్వల్లో ఫోర్త్ పోజిషన్ రష్యాను అధిగమించిన భారత్

బెంగళూరు సెప్టెంబర్ 12,అర్జున్ సమాచారం: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలురాయిని అందుకుంది. ఆర్బీఐ చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం రికార్డు స్థాయిలో పెరగడంతో, విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది.'బ్లూమ్‌బర్గ్' డేటా ప్రకారం.. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 44.9 బిలియన్ డాలర్లు పెరిగి, 785.7 బిలియన్ డాలర్ల...