విద్యతోపాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారు ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది ఎంత నాణ్యమైన విద్యను అందించాలన్నది ఉపాధ్యాయులు ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,అర్జున్ సమాచారం: మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసించిన తర్వాత విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. రాబోవు తరాల భవిష్యత్తును మార్చేందుకు, విద్యా రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా పనిచేద్దామని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. “టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ...